Andhra Pradesh: భయపడాల్సిన అవసరం మాకు లేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
చంద్రబాబు హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల్లో ఎటువంటి అవినీతి జరగలేదని, భయపడాల్సిన అవసరం తమకు లేదని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో అభివృద్ధి, సంక్షేమం జరిగాయని అన్నారు. ఒకవేళ చంద్రబాబు హయాంలో ఏవైనా లోటుపాట్లు జరిగి ఉంటే, అలాంటివి జరగకుండా జగన్ ప్రభుత్వం చూసుకోవాలని సూచించారు. అంతేతప్ప, లేనిపోని ఆరోపణలు చేయడం సబబు కాదని, కులతత్వంను రెచ్చగొట్టేలా వ్యహరించొద్దని అన్నారు.