TATA Steel: భూషణ్ స్టీల్ అనుబంధ సంస్థ అయిన భూషణ్ ఎనర్జీని కొనుగోలు చేసిన టాటా స్టీల్

షార్ట్స్‌లో చూడండి
ఇప్పటికే భూషణ్ స్టీల్‌ను కొనుగోలు చేసిన టాటా స్టీల్ తాజాగా భూషణ్ ఎనర్జీని కూడా కొనుగోలు చేసింది. భూషణ్ స్టీల్‌కు అనుబంధ సంస్థే భూషణ్ ఎనర్జీ. ఈ మేరకు ఎన్‌సీఎల్‌టీ రూ.800 కోట్ల బిడ్‌కు ఆమోద ముద్ర వేసిన అనంతరం టాటా స్టీల్ ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ‘భూషణ్ ఎనర్జీ లిమిటెడ్‌ను టాటా స్టీల్ బీఎస్ఎల్ విజయవంతంగా కొనుగోలు పూర్తి చేసింది. సెబీ నిబంధనలను పూర్తిగా పాటించి ఈ కొనుగోలును పూర్తి చేశాం’ అని టాటా స్టీల్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Go Back to Shorts
TATA Steel
Bhushan Steel
Bhushan Energy
NCLT

More Telugu News