ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘నేసమణి’!
సుత్తిని మీ దేశంలో ఏమంటారని పాక్ విద్యార్థుల పోస్ట్
ఓ కార్టూన్ ఫోటోను పోస్ట్ చేసిన వడివేలు అభిమానులు
ఆ కార్టూన్‌లో సుత్తి తగిలి పడిపోయిన వడివేలు
2001లో తమిళ్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో నాగార్జున హీరోగా ‘స్నేహమంటే ఇదేరా’ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్రను తమిళ్‌లో వడివేలు నటించారు. ఆ చిత్రంలో వడివేలు పాత్ర పేరే నేసమణి. వడివేలు అభిమానులు పోస్ట్ చేసిన సన్నివేశాన్ని చూసిన కొందరు నెటిజన్లు వడివేలు నిజంగానే సుత్తి తగిలి పడిపోయాడనుకుని #pray for nesamani హ్యాష్‌ట్యాగ్‌ను ప్రారంభించారు. ఈ హ్యాష్‌ట్యాగ్‌పై వడివేలు అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే సమంత, సిద్దార్థ్, క్రికెటర్ హర్బజన్ సింగ్ స్పందించారు. దీంతో ఈ నేసమణి హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.