vasuki: నేను అష్టకష్టాల్లో వున్నప్పుడు తెలుగు చిత్రపరిశ్రమ ఆదుకుంది: పాకీజా

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై తనదైన శైలిలో హాస్యాన్ని పండించిన పాకీజా, దాదాపు 52 సినిమాల్లో నటించారు. ఆ విషయాలను గురించి ఆమె తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తనకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు.

"మా నాన్నకి ఇద్దరు భార్యలు .. ఆయన రెండో ఆవిడతో వెళ్లిపోయాడు. మా అమ్మ కేన్సర్ తో బాధపడుతూ వుండేది .. తోబుట్టువులు ఎవరూ లేకపోవడంతో అన్నీ నేనే చూసుకునేదానిని. అలాంటి పరిస్థితుల్లో తెలుగులో దర్శకుడు బి.గోపాల్ గారు .. మోహన్ బాబుగారు నాకు వరుస అవకాశాలు ఇచ్చారు. నేను పుట్టిపెరిగింది చెన్నైలోనైనా,తెలుగు ప్రేక్షకులు నన్నెంతగానో ఆదరించారు. అమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా చాలామంది నాకు సాయం చేశారు. ఆ మధ్య ఆమె చనిపోయింది. అప్పట్లో సాయపడిన వాళ్లందరినీ నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను" అని చెప్పుకొచ్చారు. 
Go Back to Shorts
vasuki

More Telugu News