Payal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
 *  'ఆర్ఎక్స్ 100' ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన కథానాయిక పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు వ్యభిచారిగా సంచలన పాత్రను పోషిస్తోంది. వంశీ కృష్ణ దర్శకత్వంలో రూపొందే 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంలో ఈ ముద్దుగుమ్మ ఇలా వ్యభిచారి పాత్రలో కనిపించనుంది. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు.
*  మంచు విష్ణు హీరోగా నటించిన 'ఓటర్' చిత్రం ఎట్టకేలకు విడుదలవుతోంది. రెండేళ్ల క్రితమే పూర్తయిన ఈ చిత్రం పలు కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. తాజాగా సెన్సార్ కూడా పూర్తయింది. వచ్చే నెలలో దీనిని రిలీజ్ చేస్తున్నారు.
*  ప్రస్తుతం 'డిస్కో రాజా' చిత్రంలో నటిస్తున్న రవితేజ మరో చిత్రాన్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. దీనికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తాడు. సెప్టెంబర్ నుంచి షూటింగ్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
Go Back to Shorts
Payal
Bellamkonda
Manchu Vishnu
Raviteja

More Telugu News