nama nageswara rao: ఖమ్మంలో జయకేతనం ఎగురవేసిన టీఆర్ఎస్!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో ఈసారి ఒక వైపు కాంగ్రెస్ నుంచి, మరో వైపు బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి గట్టిపోటీ ఎదురవుతోంది. ఈ క్రమంలో ఖమ్మం లోక్ సభ స్థానం టీఆర్ఎస్ ఖాతాలో పడింది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరావు .. కాంగ్రెస్ అభ్యర్థి రేణుక చౌదరిపై ఘన విజయం సాధించారు. ఇద్దరూ బలమైన అభ్యర్థులే కావడంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది.

ఈ నేపథ్యంలో రేణుక చౌదరిపై నామా నాగేశ్వరరావు లక్షా 66 వేల ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. అత్యధిక మెజారిటీతో ఖమ్మం నుంచి భారీ విజయం లభించడం టీఆర్ఎస్ శ్రేణులు తేలికగా ఊపిరి పీల్చుకునేలా చేసిందనే చెప్పాలి. ఇక చేవెళ్లలోను గాలి టీఆర్ఎస్ వైపే వీస్తున్నట్టుగా తాజా ఫలితాలను బట్టి తెలుస్తోంది. అక్కడ కూడా తమదే విజయమనే ధీమాని టీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. 
Go Back to Shorts
nama nageswara rao

More Telugu News