అవసరమనుకుంటే మళ్లీ రీపోలింగ్: ఏపీ ఎన్నికల అధికారి ద్వివేది

  • ఈ నెల 27 అర్ధరాత్రి వరకు అమల్లో కోడ్
  • తప్పనిసరి పరిస్థితుల్లో రీ పోలింగ్
  • పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం తక్కువగా వున్నా రీపోలింగే
ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక కూడా అవసరం అనుకుంటే రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉందన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పులో తేడా వచ్చినప్పుడు, ఈవీఎం డీకోడ్ కానప్పుడు, ఈవీఎంలు మొరాయించినప్పుడు, పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం తక్కువగా ఉన్నప్పుడు రీపోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉందని ద్వివేది స్పష్టం చేశారు.

Go Back to Shorts
Election
Andhra Pradesh
CEO
Gopala krishna dwivedi

More Telugu News