Chandrababu: భేటీలతో చంద్రబాబు బిజీ బిజీ : శరద్‌ పవార్‌తో ముగిసిన సమావేశం

షార్ట్స్‌లో చూడండి
కేంద్రంలో లౌకిక పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు జాతీయ నాయకుల భేటీతో బిజీగా ఉన్నారు. నిన్న పలువురు నేతలను కలుసుకున్న చంద్రబాబు ఈరోజు తీరికలేకుండా తిరుగుతున్నారు. ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో మరోసారి సమావేశమై నిన్నటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన చంద్రబాబు అనంతరం ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ను కలిశారు.

దాదాపు అరగంటపాటు కొనసాగిన వీరి సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా నిన్న రాహుల్‌, అఖిలేష్‌, మాయావతిలో కలిసి జరిపిన చర్చల సారాంశాన్ని పవార్‌కు చంద్రబాబు వివరించినట్లు సమాచారం. విపక్ష కూటమి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు మాయావతి, అఖిలేష్‌ సుముఖత వ్యక్తం చేసిన విషయాన్ని వివరించి ఈనెల 21, 22 తేదీల్లో విపక్ష కూటమి భేటీకి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం సోనియాగాంధీతో భేటీ అనంతరం అమరావతికి చంద్రబాబు రానున్నారు.
Go Back to Shorts
Chandrababu
saradpawar
Rahul Gandhi
New Delhi

More Telugu News