Chandrababu: నేడు సోనియాగాంధీతో సీఎం చంద్రబాబు సమావేశం?

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో ఈరోజు సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న చంద్రబాబునాయుడు ఈ మేరకు ఆమె అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఈనెల 23వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీకి మోజార్టీ రాకుంటే లౌకిక శక్తుల కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే.

అక్కడి నుంచి లక్నో వెళ్లిన బాబు ఎస్పీ, బీఎస్పీ అధినేతలు అఖిలేష్‌, మాయావతిలను కలిసి పలు అంశాలపై చర్చించారు. తిరిగి ఢిల్లీ చేరుకున్న ఆయన ఈరోజు ఉదయం మరోసారి రాహుల్‌గాంధీతో సమావేశమై ఆయా నేతలతో చర్చించిన అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. అనంతరం వీలును బట్టి సోనియాగాంధీని కూడా కలవాలన్నది బాబు ప్రణాళికలో భాగంగా తెలుస్తోంది. భేటీ అనంతరం ఈరోజు సాయంత్రానికి ఆయన తిరిగి అమరావతి చేరుకుంటారు.
Go Back to Shorts
Chandrababu
Sonia Gandhi
Rahul Gandhi
New Delhi

More Telugu News