మా స్కూల్ తో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు!: సంస్థ సీఈవో శ్రీనివాస్ స్పష్టీకరణ
- శ్రీకాకుళంలో ప్రారంభం కానున్న పాఠశాల
- చిరంజీవి భాగస్వామిగా ఉన్నారని వార్తలు
- ఖండించిన పాఠశాల యాజమాన్యం
మెగా కుటుంబంపై ఉన్న అభిమానంతోనే చిరంజీవిని గౌరవ ఫౌండర్ గా, రామ్ చరణ్ ను గౌరవ అధ్యక్షుడిగా, నాగబాబును గౌరవ చైర్మన్ గా నియమించుకున్నామని స్పష్టం చేశారు. ఈ పాఠశాలకు, మెగా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని పునరుద్ఘాటించారు. పేద ప్రజలకు అత్యున్నత సౌకర్యాలతో ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి అందరూ సహకరిస్తారని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సంస్థ సీఈవో జె.శ్రీనివాసరావు ఓ ప్రకటనను విడుదల చేశారు.