సన్నీకి వస్తున్న మద్దతును చూస్తుంటే ఎంతో సంతోషం కలుగుతోంది: ధర్మేంద్ర
- ముంబైలో కూర్చుని సన్నీ రోడ్ షో చూశా
- సన్నీపై ఇంత ప్రజాభిమానం ఉంటుందని అనుకోలేదు
- సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు ప్రజల సమస్యలు తెలుసు
ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజల సమస్యలు ఏమిటో పూర్తిగా తెలుసని ధర్మేంద్ర చెప్పారు. సన్నీతో పాటు తాను ఉంటానని... ప్రజల సమస్యల పరిష్కారం కోసం పంజాబ్ కు వెళతానని, అలాగే కేబినెట్ మంత్రులను కూడా కలుస్తానని తెలిపారు. తాను ఏ పార్టీ వెంట లేనని... ప్రజలతో ఉంటానని చెప్పారు. నా దేశం పట్ల నాకున్న ప్రేమ ఇది అని చెప్పారు.