pm: పెద్దపెద్ద మాటలు చెప్పేవారు పనులు చేయరు: మోదీపై ప్రియాంక విమర్శలు

షార్ట్స్‌లో చూడండి
పెద్ద పెద్ద మాటలు చెప్పేవారు పనులు చేయరంటూ పరోక్షంగా మోదీపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్థ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి అకౌంట్ లో రూ.15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైంది? ఐదేళ్ల క్రితం రైతులకు ఇచ్చిన హామీ ఏమైంది? రైతుల గోడు వినే తీరిక కూడా మోదీకి లేదా? అని ప్రశ్నించారు.

 ఎన్నికల ముందే మోదీకి రైతులు గుర్తుకురావడం విడ్డూరంగా ఉందని అన్నారు. కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో మరో మోసానికి మోదీ తెరలేపారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారంలోకి రాగానే న్యాయ్ పథకం అమలు చేస్తామని, పేద ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు.
Go Back to Shorts
pm
modi
bjp
congress
priyanka
up

More Telugu News