raviteja: 'డిస్కోరాజా' ఆగిపోయిందనేది పుకారే!

షార్ట్స్‌లో చూడండి
 రవితేజ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' రూపొందుతోంది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. రెండవ షెడ్యూల్ కి సంబంధించిన అప్ డేట్ లేకపోవడంతో, ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే టాక్ జోరందుకుంది. ఇతర దర్శకులు రవితేజను సంప్రదిస్తున్నట్టుగా కూడా చెప్పుకున్నారు.

తాజాగా ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు ఖండించారు. ఈ సినిమా షూటింగు ఆగిపోలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ నెల 27వ తేదీ నుంచి రెండవ షెడ్యూల్ మొదలవుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. ఈ నెల 27 నుంచి జూన్ 21వ తేదీ వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగు జరపనున్నట్టుగా చెప్పారు. రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్ .. నభా నటేశ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
raviteja
payal
nabha

More Telugu News