గడ్చిరోలి వీర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నా.. హింసతో ఏమీ సాధించలేరు!: నారా లోకేశ్
- ఈరోజు గడ్చిరోలిలో ఐఈడీ పేలుడు
- 16 మంది దుర్మరణం, కొనసాగుతున్న కాల్పులు
- ట్విట్టర్ లో స్పందించిన ఏపీ ఐటీ మంత్రి
ఈరోజు లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘గడ్చిరోలిలో సీ-60 కమాండోలు లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన క్రూరమైన దాడిని ఖండిస్తున్నా. హింస కారణంగా ఇప్పటివరకూ ఎవరూ దేన్నీ సాధించలేకపోయారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నా. అమరులైన జవాన్ల కుటుంబాలతో మిగతా దేశ ప్రజలతో కలిసి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు. మరోవైపు ఈ రోజు ఐఈడీ పేల్చిన మావోలను పట్టుకునేందుకు బలగాలు కూంబింగ్ ను ముమ్మరం చేశాయి.