సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకార తేదీ, వేదికపై స్పష్టత ఇచ్చిన టీడీపీ వర్గాలు!
- విజయంపై ధీమాగా ఉన్న టీడీపీ
- ఈ నెల 25న చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం
- ఎన్టీఆర్ జయంతి రోజునే మహానాడు నిర్వహణ
అలాగే ఈసారి ఎన్నికల కోడ్ నేపథ్యంలో మహానాడును ఒకే రోజుకు పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఫలితాలు వచ్చిన రెండ్రోజులకు అంటే.. ఈ నెల 25న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అలాగే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 28న ఒక్కరోజు మాత్రమే ఈసారి మహానాడును నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి.