ఆయన ఫోన్ కాల్ కోసం ఎదురుచూసేవాడిని: హీరో సూర్య

  • సెల్వ రాఘవన్ ను రిక్వెస్ట్ చేశాను
  • సెట్లోకి అడుగుపెడితే ఈ ప్రపంచాన్ని మరిచిపోతాడు
  • ఆయనతో సినిమా చేయడం ఆనందంగా వుంది 
సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా 'ఎన్జీకే' సినిమా నిర్మితమైంది. రకుల్.. సాయిపల్లవి కథానాయికలుగా నటించిన ఈ సినిమాను, మే 31వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాను గురించి సూర్య మాట్లాడుతూ .. "ఇంతవరకూ నేను నాతో ఒక సినిమా చేయండి అని ఏ దర్శకుడిని అడిగినట్టుగా గుర్తులేదు.

 కానీ నాతో ఒక సినిమా చేయండి అని దర్శకుడు సెల్వ రాఘవన్ ను మాత్రం అడిగాను .. అదీ 2002లో. 'అవకాశం వస్తే తప్పకుండా చేద్దాం' అన్నారాయన. అప్పటి నుంచి ఆయన ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తుండేవాడిని. ఆయన నుంచి కాల్ వచ్చింది .. 'ఎన్ జి కె'తో నా కల నెరవేరింది. సెట్లో కి అడుగుపెడితే సెల్వరాఘవన్ ఈ ప్రపంచాన్ని మరిచిపోతాడు. అలాంటి దర్శకుడితో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా వుంది" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
surya
saipallavi
rakul

More Telugu News