Narendra Modi: నన్నే అనుకున్నాను, ఇప్పుడు ఈవీఎంల మీద కూడా పడ్డారు... చాలా సంతోషంగా ఉంది!: మోదీ వ్యంగ్యం

షార్ట్స్‌లో చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మొదట్లో తనను మాత్రమే విమర్శించేవాళ్లని, ఇప్పుడు వాళ్ల దృష్టి ఈవీఎంలపై కూడా పడిందని ఎద్దేవా చేశారు.

"తొలి మూడు విడతల ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నేతల దృష్టంతా నరేంద్ర మోదీని విమర్శించడంపైనే ఉంది. దాదాపు 40 మంది నేతలకు నన్ను తిట్టడమే పని. కానీ మూడో విడత పోలింగ్ ముగిశాక వాళ్లు ఈవీఎంలపై పడ్డారు. నాపై సగం ఫోకస్ పెట్టి మరో సగం ఫోకస్ ను ఈవీఎంలపై పెడుతున్నారు. ఆ విధంగానైనా నాపై విమర్శలు కాస్త తగ్గించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు విపక్షాల తిట్లు 50-50 ప్రాతిపదికన విభజన చెందాయి. సగం నాపై, సగం ఈవీఎంలపై" అంటూ వ్యంగ్య ధోరణిలో మాట్లాడారు.
Go Back to Shorts
Narendra Modi
BJP

More Telugu News