సిగరెట్ తాగుతుంటే అభ్యంతరం.. శ్రీకాకుళంలో బీరుబాటిళ్లతో కొట్టుకున్న యువకులు
- వైన్‌షాపులో తలలు పగిలేలా కొట్టుకున్న యువకులు
- ఆసుపత్రికి తరలించిన పోలీసులు
- పరారైన యువకుల కోసం గాలింపు
అది మరింత ముదరడంతో ఇరు వర్గాలకు చెందిన యువకులు తాగుతున్న బీరు బాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకుల తలలు పగిలాయి. మరో నలుగురు యువకులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రక్తమోడుతున్న యువకులను ఆసుపత్రికి తరలించారు. కాగా, పోలీసుల రాకను చూసిన యువకులు కొందరు అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.