నేను తనకన్నా ముందుగా భోజనం చేశానన్న కోపంతో ఒక నటి క్యారియర్ ను తన్నేసింది: 'డబ్బింగ్' జానకి
- ఆ నటి పేరు చెప్పడం ఇష్టం లేదు
- అహంభావంతో అలా చేసింది
- తగిన ఫలితం అనుభవించింది
ఆ నటి అసిస్టెంట్ తిరిగి క్యారియర్ సర్దేసి ఉంచింది. ఆ నటి తాగుతూ పేకాడి ఆలస్యంగా రూమ్ కి వచ్చింది. "అప్పుడే ఈవిడ తినేసి పడుకుందా .. ఈవిడ తినేసిన క్యారియర్లో నుంచి నేను అన్నీ తీసుకోవాలా?" అంటూ ఆ క్యారియర్ ను కాలుతో తన్నేసింది. దాంతో ఆ క్యారియర్లోని భోజనమంతా రూమ్ లో చిందరవందరగా పడిపోయింది. అంతటి అహంకారానికి పోయినందుకు ఆ తరువాత ఆ నటి తగిన ఫలితాన్ని అనుభవించింది. ఆ నటి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు గానీ .. ఇప్పటికీ ఆమె ఇండస్ట్రీలోనే వుంది " అని చెప్పుకొచ్చారు.