విశ్వనాథ్ గారి సినిమాలే నన్ను నిలబెట్టాయి: 'డబ్బింగ్' జానకి
- అన్ని భాషల్లో కలుపుకుని 800 సినిమాలు చేసుండొచ్చు
- విశ్వనాథ్ గారి దర్శకత్వంలో చేసిన తొలి చిత్రం 'జీవనజ్యోతి'
- 'సాగరసంగమం'లో తల్లిపాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది
నన్ను నిలబెట్టినవే విశ్వనాథ్ గారి సినిమాలు. శోభన్ బాబు .. వాణిశ్రీ గారు కాంబినేషన్లో విశ్వనాథ్ గారు చేసిన 'జీవనజ్యోతి' సినిమాలో నాకు తొలిసారిగా అవకాశం వచ్చింది. 'శంకరాభరణం'లో చిన్న వేషమే అయినా మంచి పేరు వచ్చింది. 'సాగర సంగమం' సినిమాలో కమలహాసన్ కి తల్లిగా నేను చేసిన పాత్ర నన్ను నిలబెట్టేసింది. ఆ పాత్రలో చాలామంది తమ అమ్మలను చూసుకున్నారు. ఎక్కడికి వెళ్లినా గుర్తుపట్టేసి .. తమ తల్లి కూడా నాలాగే ఉంటుందని చెప్పేవారు. అంతగా ఆ పాత్ర కదిలించగలిగింది" అని చెప్పుకొచ్చారు.