Jagapathi Babu: నాకు అమ్మాయిల పిచ్చి అంటారు... ఆ మాటను నేను ఎప్పుడూ ఒప్పుకోను: జగపతిబాబు

షార్ట్స్‌లో చూడండి
సీనియర్ నటుడు జగపతిబాబు ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  అనేక విషయాలను వెల్లడించారు. ఇండస్ట్రీలో మీరు ఏ హీరోయిన్ తో నటించడాన్ని బాగా ఆస్వాదిస్తారంటూ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, ఇది చాలా కష్టమైన ప్రశ్న అని చెప్పారు. ఒకరి పేరంటూ ప్రత్యేకంగా చెప్పలేనని, రమ్యకృష్ణ చాలా మంచి అమ్మాయి అని, ఆమె వ్యక్తిగతంగా కూడా డబ్బులు జాగ్రత్త, వృథా చేసుకోవద్దు అంటూ సలహాలు ఇస్తూ గైడ్ చేస్తుందని వివరించారు. ఇక సౌందర్య గురించి చెబుతూ 'స్వచ్ఛమైన అమ్మాయి' అంటూ ఒకే మాట చెప్పారు.

ఆమని, కల్యాణి, ప్రియమణి కూడా తనతో అనేక చిత్రాల్లో నటించారని, ఆమని ఓ నటిగా ఎంతో గొప్పదని అన్నారు. ఆమెతో నటించిన శుభలగ్నం చిత్రం తన కెరీర్ లో మంచి సినిమాగా నిలిచిపోతుందని, అందులో ఆమని నటన అద్భుతం అని పేర్కొన్నారు. అయితే, ఇండస్ట్రీలో తన గురించి ఉన్న అపోహ గురించి జగపతిబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అందరూ తనను ఉద్దేశించి 'స్త్రీలోలుడు' అని భావిస్తారని, అది సరికాదని, ఆ మాటంటే తాను ఎప్పుడూ ఒప్పుకోనని స్పష్టం చేశారు. అమ్మాయిల పిచ్చి అంటే అది వేరే అర్థం వస్తుందని, చాలామంది దాని అర్థం తెలియకుండా వాడుతుంటారని జగపతిబాబు తెలిపారు. సరసానికి, అమ్మాయిల పిచ్చికి, ప్రేమకి చాలా తేడా ఉందని అన్నారు. తాను తల్లి నుంచి ప్రతి స్త్రీని ప్రేమిస్తానని, అందుకే స్త్రీలను ప్రేమిస్తుంటానని ఎప్పుడూ చెబుతుంటానని జగపతిబాబు వివరించారు.
Go Back to Shorts
Jagapathi Babu
Tollywood

More Telugu News