Andhra Pradesh: వెన్నుపోట్లు పొడిచిన చంద్రబాబుని ఆ దేవుడు ఎందుకు ఆశీర్వదించాడో!: వైసీపీ నేత రోజా

షార్ట్స్‌లో చూడండి
మహిళల సమస్యలపై గళం ఎత్తేందుకు అసెంబ్లీలో నేను ఉండాలని ప్రజలు అనుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో తన నియోజకవర్గం నగరిలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, కాల్ మనీ-సెక్స్ రాకెట్ కేసులో ఏ ఒక్క నేరస్తుడికైనా శిక్ష పడిందా? నేరస్తులకు అండగా ఉంటూ, నువ్వు వెధవ పనులు చేస్తూ, దాన్ని నేను నిలదీస్తే నన్ను అసెంబ్లీకి రాకూడదని చెప్పడం ఎంత వరకు సమంజసం? నువ్వో, నీ తండ్రి ఖర్జూరపు నాయుడో అనుకుంటే కాదు, భగవంతుడు అనుకోవాలి. వెన్నుపోట్లు పొడిచిన చంద్రబాబునాయుడుని ఆ దేవుడు ఎందుకు ఆశీర్వదించాడో తెలియదుగానీ ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ మూడు సార్లు రాష్ట్రంలో కరవు తప్ప ఏమీ రాలేదు. ఈసారి అయినా ప్రజలు మోసపోవద్దు. ప్రజల మీద అభిమానం ఉన్న వ్యక్తి జగన్ ని గెలిపించుకోవాలి’ అని రోజా కోరారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
YSRCP
roja

More Telugu News