Telangana: ఎన్నికల ఎఫెక్ట్.. హైదరాబాద్ లో రూ.2.4 కోట్లను పట్టుకున్న పోలీసులు!

షార్ట్స్‌లో చూడండి
సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా నోట్ల కట్టలు గుట్టలుగుట్టలుగా బయటపడుతున్నాయి. తాజాగా తెలంగాణలోని హైదరాబాద్ లో ఈరోజు భారీగా నగదు బయటపడింది. నగరంలోని లంగర్ హౌస్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఓ కారులో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో సదరు వాహనంలో సోదాలు చేపట్టారు.

దీంతో కారులో దాచిన రూ.2.4 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో వెళుతున్న ఆరుగురిని అరెస్ట్ చేయడంతో పాటు కారును సీజ్ చేశారు. ఈ నగదును ఎవరు పంపారు? ఎవరికి అందించేందుకు తీసుకెళుతున్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Go Back to Shorts
Telangana
Hyderabad
Police
2.4 crore cash
Telangana Election 2018

More Telugu News