నేడు ఏపీ, తెలంగాణలలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సుడిగాలి పర్యటన
- అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో యోగి ప్రచారం
- తెలంగాణలోని పెద్దపల్లిలో బహిరంగ సభ
- యోగి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం
ఏపీలో అడుగుపెట్టడానికి ముందు తెలంగాణలోని పెద్దపల్లి పట్టణంలోని జూనియర్ కాలేజీలో బీజేపీ బహిరంగ సభలో ఆదిత్యనాథ్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత జహీరాబాద్‌లోని యల్లారెడ్డిలో ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం ఏపీలోని అనంతపురం, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలలో జరిగే ఎన్నికల ప్రచారంలో యోగి పాల్గొంటారు.