ఏఐ కెమెరాలకు కనిపించకుండా చేసే షర్ట్.. జర్మన్ డిజైనర్ వింత ప్రయోగం!
- ఏఐ కెమెరాలను గందరగోళపరిచే షర్ట్ రూపకల్పన
- ‘డిజిటల్ క్యామొఫ్లేజ్’గా షర్ట్‌కు పేరు
- షర్ట్‌తో వ్యక్తిని గుర్తించలేకపోయిన ఏఐ
- రంగులు, ఆకారాలతో ఏఐను గందరగోళపరిచే డిజైన్
- ఏఐ సాయంతో పలుమార్లు డిజైన్ పరీక్ష
మనిషిని చూస్తే గుర్తించే ఏఐ కెమెరాలను మోసం చేయొచ్చా? జర్మన్ డిజైనర్ సైమన్ వెకర్ట్ ఈ ప్రశ్నకు సమాధానం వెతికారు. అందులో భాగంగా ‘డిజిటల్ క్యామొఫ్లేజ్’ పేరుతో ప్రత్యేకమైన షర్ట్‌ను రూపొందించారు. ఈ షర్ట్ ధరించిన వ్యక్తిని ఏఐ ఆధారిత కెమెరాలు గుర్తించలేకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
చూడటానికి ఈ షర్ట్ సాధారణ రంగురంగుల దుస్తుల్లానే ఉంటుంది. ఆకుపచ్చ, గులాబీ, నారింజ రంగుల్లో రకరకాల ఆకారాలు కనిపిస్తాయి. అయితే ఈ డిజైన్ వెనుక అసలు ఉద్దేశం ఏఐ నిఘా వ్యవస్థలను గందరగోళానికి గురిచేయడం.
వెకర్ట్ చేసిన ఓ ప్రయోగంలో కెమెరా ఓ వ్యక్తిని గుర్తించి చుట్టూ ఆకుపచ్చ బాక్స్ పెట్టింది. ‘PERSON’ అని కూడా చూపించింది. అదే వ్యక్తి ఈ షర్ట్‌ను శరీరం ముందు పెట్టగానే ఆ గుర్తింపు మాయమైంది. షర్ట్‌ను పక్కకు తీస్తే కెమెరా మళ్లీ వ్యక్తిని గుర్తించింది.
రంగులు, ఆకారాలతో మాయ
మనుషుల్లా ఏఐ కెమెరాలు వ్యక్తిని అర్థం చేసుకోవు. వేలాది చిత్రాల నుంచి నేర్చుకున్న ఆకారాలు, అంచులు, రంగులు, నమూనాల ఆధారంగా మనిషిని గుర్తిస్తాయి. షర్ట్‌పై ఉన్న రంగులు, ఒకదానిపై ఒకటి పడే ఆకారాలు ఈ సంకేతాలను గందరగోళానికి గురిచేస్తాయి. దీంతో కెమెరాకు శరీర ఆకృతి స్పష్టంగా కనిపించదు.
ఈ డిజైన్‌ను వెకర్ట్ యాదృచ్ఛికంగా రూపొందించలేదు. ఏఐ సాయంతో నమూనాలను పదేపదే మార్చి పరీక్షించారు. దీనిని ఆయన ‘అడ్వర్సరియల్ లూప్’గా పేర్కొన్నారు. కెమెరా వ్యక్తిని ఎంత నమ్మకంగా గుర్తిస్తుందో పరిశీలించి, దానికి తగ్గట్టు షర్ట్ డిజైన్‌ను మార్చారు.
ఈ ప్రయోగాన్ని రియల్‌టైమ్‌లో వస్తువులను గుర్తించగల ‘యోలో’ అనే ఓపెన్ సోర్స్ ఏఐ వ్యవస్థపై పరీక్షించారు. అయితే ఈ షర్ట్ ప్రతి సీసీటీవీ కెమెరాను మోసం చేస్తుందని డిజైనర్ చెప్పడం లేదు. ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థల్లో ఉన్న బలహీనతలను చూపించడమే ఈ ప్రయోగం ఉద్దేశమని ఆయన చెబుతున్నారు.