shankar: శంకర్ తదుపరి సినిమా హీరో హృతిక్ రోషన్

షార్ట్స్‌లో చూడండి
భారీ బడ్జెట్ చిత్రాలకి .. భారీ తారాగణంతో కూడిన చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా శంకర్ కనిపిస్తాడు. బలమైన కథాకథనాలకు .. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ప్రేక్షకులను విస్మయులను చేయడం ఆయన ప్రత్యేకత. అలాంటి శంకర్ .. ప్రస్తుతం 'భారతీయుడు 2' సినిమా పనులతో బిజీగా వున్నాడు. కమల్ కథానాయకుడిగా .. లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో ఆయన ఈ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తరువాత శంకర్ ఏ హీరోతో చేయనున్నాడనే ఆసక్తి ఆయన అభిమానుల్లో వుంది. ఆయన తదుపరి సినిమా హీరో 'హృతిక్ రోషన్' అనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ కొనసాగనుందట. ఈ కథకి హృతిక్ రోషన్ అయితేనే సరిగ్గా సరిపోతాడని భావించి, ఆయనను సంప్రదించడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను ఆయన టీమ్ పూర్తి చేసే పనిలో ఉందట. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
Go Back to Shorts
shankar
hrithik

More Telugu News