వరుణ్ తేజ్ తో రామ్ చరణ్ సెల్ఫీ.. పవన్ బాబాయ్ కి హెల్ప్ చేయడానికి రావాలంటున్న నెటిజెన్లు

  • ఓ రెస్టారెంట్ లో సెల్ఫీ తీసుకున్న మెగా బ్రదర్స్
  • పవన్ కి హెల్ప్ చేయడానికి ఇద్దరు రావచ్చు కదా అంటోన్న నెటిజెన్లు
  • 'బ్ర‌ద‌ర్ ల‌వ్' అనే హ్యాష్ ట్యాగ్‌ తో సెల్ఫీ
మెగా బ్రదర్స్ రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఓ రెస్టారెంట్ లో కలిసి దిగిన సెల్ఫీ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చరణ్ తో కలిసి దిగిన ఫోటోని 'బ్ర‌ద‌ర్ ల‌వ్' అనే హ్యాష్ ట్యాగ్‌ తో వ‌రుణ్ తేజ్ త‌న ట్విట్ట‌ర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ నేప‌థ్యంలో నెటిజెన్లు పవన్ కల్యాణ్ కి హెల్ప్ చేయడానికి ఇద్దరు రావచ్చు కదా అని కొందరు ట్వీట్ చేస్తుండగా, న్యూ లుక్ లో సూపర్ గా ఉన్నారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. కాగా, ప్రస్తుతం వాల్మీకి సినిమాతో వరుణ్ బిజీగా ఉండగా, రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్ అనే ప్రాజెక్ట్‌తో చరణ్ బిజీగా ఉన్నాడు.
Go Back to Shorts
varun tej
Ramcharan
Pawan Kalyan
Tollywood

More Telugu News