రవితేజతో మరోమారు జోడీ కడుతోన్న కాజల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవితేజతో మరోమారు జోడీ కడుతోన్న కాజల్

  • రవితేజ తాజా చిత్రంగా 'డిస్కోరాజా'
  • తదుపరి సినిమాగా 'కనకదుర్గ'
  • త్వరలోనే పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
ప్రస్తుతం రవితేజ వరుస పరాజయాలతో వున్నాడు. ఈ ఏడాది తప్పకుండా హిట్లు కొట్టాలనే పట్టుదలతో ఆయన రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఒక వైపున వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కో రాజా' సెట్స్ పై ఉండగానే దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కి కూడా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తమిళంలో విజయ్ హీరోగా చేసి హిట్ కొట్టిన 'తెరి' సినిమాకి ఇది రీమేక్.

ఈ సినిమాకి 'కనకదుర్గ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చని అంటున్నారు. కథాపరంగా ఈ సినిమాలో ఇద్దరు నాయికలు వుంటారు. ఒక కథానాయికగా ఇంతకుముందే కేథరిన్ ను తీసుకున్నారు. మరో కథానాయికగా కాజల్ ను ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారం. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'సారొచ్చారు' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తాజా చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
raviteja
kajal
catherine

More Telugu News