YSRCP: నేను మాట్లాడిన స్పీచ్ మొత్తం వినండి... మీకే తెలుస్తుంది: పీవీపీ వివరణ

షార్ట్స్‌లో చూడండి
వైసీపీలో కొత్తగా చేరిన ప్రముఖ వ్యాపారవేత్త 'పీవీపీ' (పొట్లూరి వరప్రసాద్) అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అంటూ ఆయన వ్యాఖ్యానించినట్టు మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. పీవీపీ వ్యాఖ్యలకు ప్రముఖుల ఖండన కూడా తోడవడంతో ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో ఈ చివరి నుంచి ఆ చివరికి పాకిపోయింది.

 అయితే, తాను అన్నది ఏంటో సరిగా గమనించకుండా వక్రీకరించారంటూ పీవీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయవాడలో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టారు. సభలో తనకంటే ముందు ఏడుగురు వ్యక్తులు మాట్లాడిన తరుణంలో మరోసారి తాను కూడా అదే సబ్జెక్ మాట్లాడి బోర్ కొట్టించనని చెప్పానే తప్ప, ప్రత్యేక హోదా ఓ బోరింగ్ సబ్జెక్ట్ అనలేదని స్ఫష్టం చేశారు. కావాలంటే తాను మాట్లాడిన స్పీచ్ మొత్తం వింటే మీకే తెలుస్తుందని మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు.

తాను అనని మాటలను తనకు ఆపాదించి, చివరికి ఈ విషయంలో పార్టీ అధినేతను కూడా లాగడం దారుణమని అసహనం వ్యక్తం చేశారు. తాను ఎవరి ఉచ్చులో పడదలుచుకోలేదని, ప్రత్యర్థుల మైండ్ గేమ్ లను అసలు పట్టించుకోనని స్పష్టం చేశారు.
Go Back to Shorts
YSRCP
Andhra Pradesh

More Telugu News