Telugudesam: చివరి నిమిషంలో పూతలపట్టు అసెంబ్లీ అభ్యర్థిని మార్చేసిన టీడీపీ

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓవైపు ముమ్మర ప్రచారంలో పాల్గొంటూనే మరోవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా రాజకీయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందులో భాగంగా పూతలపట్టు నియోజకవర్గంలో అభ్యర్థిని చివరి నిమిషంలో మార్చేశారు. స్థానికుల అభిప్రాయాలకు విలువనిస్తూ మొదట పేర్కొన్న తెర్లా పూర్ణం స్థానంలో తాజాగా లలితా థామస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. తెర్లా పూర్ణంను అసెంబ్లీ అభ్యర్థిగా పేర్కొనడంతో స్థానిక నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో పునఃసమీక్షించిన టీడీపీ హైకమాండ్ లలితా థామస్ పేరును ప్రకటించింది. అయితే, తెర్లా పూర్ణం అనారోగ్యంతో బాధపడుతుండడం వల్లే అభ్యర్థిని మార్చాల్సి వచ్చిందంటూ పార్టీ వర్గాలు వివరణ ఇచ్చాయి.
Go Back to Shorts
Telugudesam
Chittoor District
Chandrababu

More Telugu News