చైనాకు చెంపపెట్టు... మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ఈయూ కసరత్తు
- ఇప్పటికే మసూద్‌ను నిషేధించిన ఫ్రాన్స్
- మిగిలిన సభ్య దేశాలను ఒప్పించేందుకు ప్రయత్నం
- కొద్దిరోజుల్లో ఈ నిర్ణయం వెలువడే అవకాశం
ఇదే దిశగా మిగిలిన దేశాలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఎమాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వం ప్రకటించింది. యూనియన్‌లోని 28 సభ్య దేశాలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకునేందుకు కార్యాచరణ ప్రారంభించింది. 2009, 2016తోపాటు ఇటీవల యూఎన్ భద్రతా మండలిలో మసూద్ అజర్ పై తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. ఇది జరిగిన కొద్దిరోజులకే యూరోపియన్ యూనియన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇది అమల్లోకి వస్తే చైనా తీరుకు చెంపపెట్టే అనవచ్చు.