గోవా నూతన ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోవా నూతన ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్

  • తుదిశ్వాస విడిచిన పారికర్
  • ఆయన స్థానంలో ప్రమోద్ సావంత్
  • కాసేపట్లో అధికారిక ప్రకటన
అనారోగ్య కారణాలతో గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ను నియమించనున్నారు. ఈ మేరకు తమ మిత్రపక్షాలు ఎంజీఎఫ్, జీఎఫ్పీలతో బీజేపీ నేతలు చర్చలు జరిపారు. కాసేపట్లో సావంత్ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి.

గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. వీటిలో మనోహర్ పారికర్, మరో ఎమ్మెల్యే ఫ్రాన్సిస్ డిసౌజాల మరణంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. మరో ఎద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో, సభలో ప్రస్తుతం 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 19 కాగా... 14 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉంది.
goa
pramod sawanth
Chief Minister

More Telugu News