Narendra Modi: పారికర్ మృతిపై ప్రధాని మోదీ స్పందన

షార్ట్స్‌లో చూడండి
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మనోహర్ పారికర్ అసమాన నాయకుడని, నిజమైన దేశభక్తుడని కొనియాడారు. తిరుగులేని పరిపాలకుడిగా అందరి అభిమానం సంపాదించుకోవడం పారికర్ కే సాధ్యమైందని అన్నారు. ఆధునిక గోవా నిర్మాతగా పారికర్ ను అభివర్ణించారు.

ఎంతో కలుపుగోలుతనంగా ఉండేవాడని, ఆయన ప్రజా సంక్షేమ విధానాలు రాష్ట్రాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతేగాకుండా, రక్షణమంత్రిగా పనిచేసిన కాలంలో భారత్ గర్వించే విధంగా పనిచేశారని కీర్తించారు. ఆయన హయాంలో భారత్ శక్తిసామర్ధ్యాలేంటో ప్రపంచానికి తెలిశాయని పేర్కొన్నారు. దేశీయ రక్షణ ఉత్పత్తులకు ఊతమివ్వడంతోపాటు విశ్రాంత సైనికుల జీవన ప్రమాణాలు మరింత మెరుగయ్యేలా అనేక చర్యలు తీసుకున్నారని తన ట్విట్టర్ ఖాతాలో వివరించారు.
Go Back to Shorts
Narendra Modi
BJP

More Telugu News