ప్రారంభమైన ‘మా’ పోలింగ్.. నరేశ్-శివాజీ రాజా ప్యానల్ మధ్య పోటాపోటీ
- సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం
- రాత్రి కల్లా తుది ఫలితాలు వెల్లడి
- కోలాహలంగా ఫిలిం చాంబర్
కాగా, గత కొన్ని రోజులుగా శివాజీ రాజా- నరేశ్ ప్యానెళ్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, తమ మద్దతు నరేశ్ ప్యానెల్‌కేనని మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి తనకు పోటీ చేసే ఉద్దేశం లేదని, కొందరి బలవంతం మీదే బరిలోకి దిగుతున్నట్టు శివాజీ రాజీ ఇది వరకే ప్రకటించాడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఎంతమాత్రమూ లేదని శివాజీ రాజా పేర్కొన్నాడు.