కారు బానెట్ పై వ్యక్తి ఉన్నా కిలోమీటరు దూరం వరకూ నడుపుకుంటూ వెళ్లిన దుండగుడు
- ఢిల్లీలో దారుణ ఘటన
- ఢీకొట్టడమే కాక క్యాబ్ డ్రైవర్ పై జులుం
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
సింగ్ ను పడేసేందుకు కారును ఇష్టం వచ్చినట్టు అటూ ఇటూ తిప్పాడు. అయినా సింగ్ గట్టిగా పట్టుకుని బానెట్ కు వేళ్లాడుతూ ఉండిపోయాడు. ఇంతలో ఓ వ్యక్తి తన వాహనాన్ని రోహన్ మిట్టల్ కారుకు అడ్డుగా పెట్టడంతో ఈ దారుణానికి అడ్డుకట్ట పడింది. అనంతరం ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగిన దరిమిలా రోహన్ మిట్టల్ పై వీరభద్రసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.