‘96’ రీమేక్‌కు ఆసక్తికర టైటిల్‌ను రిజిస్టర్ చేయించిన చిత్రబృందం!
- శర్వా, సమంత జంటగా రీమేక్
- నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు
- జానకికి వీరాభిమానిగా సామ్
ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఇటీవల ఫిలిం ఛాంబర్‌లో్ ‘జానకీ దేవి’ అనే టైటిల్‌ను చిత్రబృందం రిజిస్టర్ చేయించిందని సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ గాయని ఎస్ జానకికి వీరాభిమానిగా సమంత నటిస్తోంది. ఆమె పాడిన పాటలను సామ్ ఈ చిత్రంలో పాడుతూ ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్రానికి ‘జానకీ దేవి’ అనే టైటిల్‌ను పెట్టబోతున్నారని సమాచారం.