భారత్ అదుపులో పాక్ గూఢచారి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత్ అదుపులో పాక్ గూఢచారి!

  • బీఎస్ఎఫ్ పోస్ట్ లో రెక్కీ
  • ఫోటోలు తీస్తున్న వ్యక్తి అరెస్ట్
  • అతన్నుంచి పాక్ సిమ్ కార్డు స్వాధీనం
పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో పాక్ గూఢచారి ఒకరు పట్టుబడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక్కడి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పోస్ట్ లో రెక్కీ నిర్వహిస్తుండగా, అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. పోస్ట్ ను, అక్కడి వాతావరణాన్ని ఫోటోలు తీస్తున్న అతని పేరు, వివరాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఆయన వద్ద పాకిస్థాన్ సిమ్ కార్డుతో పనిచేస్తున్న సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆ సిమ్ కార్డు, పాక్ లోని 8 వాట్స్ యాప్ గ్రూపుల్లో ఉందని వెల్లడించారు. ఫోన్ ను విశ్లేషిస్తున్నామని, అతని వద్ద ఉన్న ఫోటోలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం అతన్ని ఇంటరాగేట్ చేస్తున్నామని అన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Pakistan
Spy
BSF

More Telugu News