ఏపీ విభజన విషయంలో కాంగ్రెస్ చేసిన పాపం ఎన్ని గుళ్లు తిరిగినా పోదు!: కన్నా లక్ష్మీనారాయణ
- పార్లమెంటు తలుపులు మూసి విభజించినప్పుడు నిద్రపోయారా?
- మీరు, మీ పచ్చతోక పార్టీ 2019లో మూల్యం చెల్లిస్తారు
- ట్విట్టర్ లో రాహుల్ గాంధీకి కన్నా హెచ్చరిక
ఈరోజు కన్నా ట్విట్టర్ లో స్పందిస్తూ..‘@RahulGandhi.. మీ స్వార్థం కోసం పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించినప్పుడు మీరు నిద్ర పోయారా? దేశంలో ఎన్ని గుళ్ళకు తిరిగినా భస్మాసుర హస్తంతో కాంగ్రెస్ ఏపీ విషయంలో చేసిన పాపం ఎప్పటికీ పోదు. మీ అసమర్థతకు, మీ "పచ్చ తోక పార్టీ" అవినీతికి 2019లో మూల్యం చెల్లిస్తారు’ అని హెచ్చరించారు.