జ్యోతి హత్య కేసులో వీడుతున్న చిక్కుముడి... శశి, పవన్ అనే యువకుల అరెస్ట్!
- వారం రోజుల క్రితం జ్యోతి హత్య
- అమరావతి ప్రాంతంలో దారుణంగా చంపేసిన ప్రియుడు!
- నేడు శ్రీనివాస్ డిశ్చార్జ్ కాగానే అరెస్ట్ చేస్తామన్న పోలీసులు
తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండటంతోనే జ్యోతిని వదిలించుకోవాలని శ్రీనివాస్ నిర్ణయానికి వచ్చాడని, జ్యోతిని కలిసే ముందు శ్రీనివాస్ సెల్ ఫోన్ నుంచి వీరిద్దరికీ కాల్స్ వెళ్లాయని స్పష్టమైనట్టు చెబుతున్నారు. నేడు శ్రీనివాస్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని, ఆ వెంటనే అదుపులోకి తీసుకుని, గంటల వ్యవధిలోనే కేసు గురించిన పూర్తి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు.