జయరాం హత్యలో ఐదుగురు? విశాల్, నగేశ్‌లను విచారిస్తున్న పోలీసులు!
- పెద్దగా సహకరించని రాకేష్
- తెరపైకి ఇద్దరు పోలీసు అధికారుల పేర్లు
- మరో ముగ్గురు అధికారులకు ఫోన్
ఇప్పటికే ఎస్ఆర్ నగర్‌కు చెందిన విశాల్, నగేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరు జయరాం హత్య జరిగిన రోజు రాకేష్ ఇంట్లో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు పోలీసు అధికారుల పేర్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. మరో ముగ్గురు అధికారులతో రాకేష్ ఫోన్‌లో సంభాషించినట్టు సమాచారం. రాకేష్, జయరాంకు మధ్య రూ.4.5 కోట్ల లావాదేవీల విషయమై ఎలాంటి ఆధారాలు లభించకపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.