కృష్ణా జిల్లాలోని ఓ ఇంట్లో పేలిన సిలిండర్.. సజీవ దహనమైన యువకుడు!
- మచిలీపట్నంలోని మగ్గాలకాలనీలో ఘటన
- మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది
- కేసు నమోదు చేసిన పోలీసులు
సిలిండర్ పేలుడు సందర్భంగా భారీ శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.