ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు కోర్టు ధిక్కార నోటీసులు పంపిన సుప్రీంకోర్టు
- సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా నాగేశ్వరరావును నియమించడంపై ప్రశాంత్ భూషణ్ విమర్శలు
- సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కేంద్ర ప్రభుత్వం
- కోర్టు ఆదేశాలను విమర్శించడం.. న్యాయ వ్యవస్థలో తలదూర్చడమవుతుందన్న సుప్రీం
కోర్టు ఆదేశాల మేరకు జరిగిన అంశాలపై లాయర్లు కానీ, ఇతరులు కానీ బహిరంగంగా విమర్శలు గుప్పించడం... ప్రజలపై ప్రభావం చూపుతుందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను విమర్శించడం... న్యాయవ్యవస్థలో తలదూర్చడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై పూర్తి స్థాయిలో వాదనలను వింటామని తెలిపింది. మార్చి 7వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.