Prajashanti: కేఏ పాల్... నీకు ఒక్క ఓటు కూడా రాదు: 'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ' పృధ్వీ

షార్ట్స్‌లో చూడండి
వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పేరిట బరిలోకి దిగుతానని చెబుతున్న కేఏ పాల్ కు ఒక్క ఓటు కూడా రాబోదని సినీ నటుడు 'ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ'గా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ వ్యాఖ్యానించారు. ఐదేళ్లుగా పత్తాలేని పాల్ కు పేదరికం, నీతి నిజాయతీ ఇప్పుడు గుర్తుకు వచ్చాయా? అని ప్రశ్నించిన ఆయన, ఎన్నికల్లో దిగే ముందు ఈ నాలుగున్నరేళ్లూ ఎక్కడ ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన పృథ్వీ, పాల్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని అన్నారు. తమ వద్ద లక్షల కోట్ల డబ్బుందని చెప్పుకుంటున్న పాల్, దాన్ని ప్రజలకు పంచి ఇవ్వచ్చుకదా అని చురకలు వేశారు.
Go Back to Shorts
Prajashanti
KZ Paul
Pruthvi

More Telugu News