'డిస్కోరాజా'లో వృద్ధుడిగా రవితేజ?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'డిస్కోరాజా'లో వృద్ధుడిగా రవితేజ?

  • వీఐ ఆనంద్ నుంచి మరో థ్రిల్లర్ మూవీ
  • 'డిస్కో రాజా'గా రవితేజ
  • ఇంతవరకూ రవితేజ చేయని కాన్సెప్ట్  
రవితేజ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కో రాజా' నిర్మితమవుతోంది. వీఐ ఆనంద్ సినిమాలు రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా ఉంటాయి. థ్రిల్లర్ నేపథ్యంలో సస్పెన్స్ తో సాగుతుంటాయి. రవితేజ సినిమా కూడా అదే తరహాలో కొనసాగనున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.

ఈ సినిమాలో కథ ఆరంభంలో రవితేజ వృద్ధుడిగా కనిపిస్తాడట. ఆ తరువాత తన శత్రువులపై పగ తీర్చుకోవడం కోసం యువకుడిగా మారిపోతాడట. వృద్ధుడిగా వున్న ఆయన యువకుడిగా ఎలా మారిపోతాడనేదే సస్పెన్స్. ఇలా ఒక కొత్త కాన్సెప్ట్ తో వున్న కారణంగానే ఈ సినిమా చేయడానికి వెంటనే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీగా ఈ కథ సాగుతుందని చెబుతున్నారు. వరుస పరాజయాలతో వున్న రవితేజ, ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.
raviteja

More Telugu News