దగ్గుబాటి హితేశ్ కు అమెరికా పౌరసత్వం.. ఎన్నికల్లో పోటీ చేయడానికి అడ్డంకి?
- పౌరసత్వం రద్దుకు దరఖాస్తు చేసిన హితేశ్
- గడువులోగా ఆమోదం పొందితే ఎన్నికల్లో పోటీ
- లేకుంటే రంగంలోకి దగ్గుబాటి వెంకటేశ్వరరావు
దగ్గుబాటి హితేశ్ కు ప్రస్తుతం అమెరికా పౌరసత్వం ఉంది. విదేశీ పౌరసత్వం ఉన్నవారు భారత ఎన్నికల్లో పోటీ చేయడం నిబంధనల ప్రకారం కుదరదు. ఈ నేపథ్యంలో అమెరికా పౌరసత్వం రద్దుకు హితేశ్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ పౌరసత్వం రద్దయిన వెంటనే హితేశ్ తన తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి వైసీపీలో చేరుతారని తెలుస్తోంది. ఒకవేళ నిర్ణీత సమయంలోగా పౌరసత్వం రద్దుకాకుంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావే పోటీలోకి దిగే అవకాశముందని ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.