Andhra Pradesh: జలీల్ ఖానే అలా చెప్పుకుంటున్నారు.. చంద్రబాబు ఆమె పేరును ప్రకటించలేదు: ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా

షార్ట్స్‌లో చూడండి
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా జలీల్ ఖాన్ కుమార్తె షబానా పేరును చంద్రబాబు ప్రకటించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా అన్నారు. ఈ నియోజకవర్గంలో తమ వర్గీయులు ఎక్కువమంది ఉన్నారని, తమను సంప్రదించకుండా చంద్రబాబు అభ్యర్థిని ప్రకటిస్తారని తాము అనుకోవడం లేదన్నారు. చంద్రబాబు తమ కుమార్తె పేరును ప్రకటించినట్టు జలీల్ ఖానే చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని చంద్రబాబు వద్దే తేల్చుకుంటామని, నేడు ఆయనను కలుస్తామని నాగుల్ మీరా చెప్పారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Vijayawada
Jaleel Khan
Nagul meera

More Telugu News