నేడు నారా లోకేశ్ పుట్టిన రోజు.. ట్విట్టర్ లో స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి!

  • లోకేశ్ కు ఆశీస్సులు తెలిపిన సీఎం
  • ప్రజాసేవను నిజాయతీతో కొనసాగిస్తారని ఆకాంక్ష
  • దావోస్ లో పర్యటిస్తున్న నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేశ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ట్విట్టర్ లో చంద్రబాబు స్పందిస్తూ..‘పుట్టినరోజు జరుపుకుంటున్న నారా లోకేశ్ కు నా ఆశీస్సులు. పూర్తి నిజాయతీ, అంకిత భావంతో ఏపీ ప్రజలకు తన సేవలను లోకేశ్ కొనసాగిస్తారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

ప్రస్తుతం లోకేశ్ స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొంటున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో చంద్రబాబుకు బదులుగా లోకేశ్ హాజరవుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Nara Lokesh
Telugudesam
Twitter
Chief Minister
birthday
wishes

More Telugu News