ఏపీలో ఎన్నికల నాటికి బీజేపీలో గుండు సున్నా మాత్రమే మిగులుతుంది!: బుద్ధా వెంకన్న సెటైర్లు
- ఏపీకి కేంద్రం నిధులు ఇవ్వట్లేదు
- కన్నా తన ఆస్తులను ప్రకటించాలి
- విజయవాడలో మీడియాతో టీడీపీ నేత
కన్నా లక్ష్మీనారాయణ దెబ్బకు ఏపీలో బీజేపీ ఖాళీ అయిపోతోందని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. ఎన్నికలకు 100 రోజులు ఉండగానే బీజేపీని చాలామంది వీడారనీ, ఎన్నికలు జరిగే నాటికి బీజేపీలో కన్నా నాయకత్వంలో గుండు సున్నా మాత్రమే మిగులుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిధులు కేటాయించకుండా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బీజేపీ విమర్శలు గుప్పించడం దారుణమన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.