పగిలిపోయిన మిషన్ భగీరథ పైప్ లైన్.. సెల్ఫీల కోసం ఎగబడిన యువత!
- నాగర్ కర్నూలు జిల్లా మెడిపూర్ వద్ద ఘటన
- 50-60 అడుగుల ఎత్తులో ఎగసిపడ్డ నీరు
- నీటి సరఫరాను నిలిపివేసిన అధికారులు
కాగా, అచ్చం సినిమా సెట్ లా నీళ్లు గాల్లోకి విరజిమ్మడంతో స్థానికులు భారీగా ఇక్కడకు చేరుకున్నారు. చాలా మంది యువత పోటీపడి మరీ సెల్ఫీలు తీసుకున్నారు. చివరికి ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతు చేసేందుకు సిబ్బందిని పంపారు. గతంలో నిర్మల్ జిల్లాలోని మిషన్ భగీరథ పైప్ లైన్ పగలడంతో 15 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎగసిపడిన సంగతి తెలిసిందే.