Girl: పదేపదే అత్యాచారం... మృతశిశువును ప్రసవించి విద్యార్థిని మరణం!

  • తమిళనాడులో ఘటన
  • 17 ఏళ్ల బాలికపై కన్నేసిన తమిళరసన్
  • కడుపులోనే మరణించిన శిశువు
  • ఆరోగ్యం క్షీణించి బాలిక మృతి
ఓ విద్యార్థినిపై పదేపదే అత్యాచారం చేసి, ఆమెకు గర్భం వచ్చేందుకు కారణమైన ఓ యువకుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఊతంకరై పుదూర్‌ భూగునై గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక, ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతూ, తన తాత, అవ్వల వద్ద ఉంటోంది.

ఆమెపై కన్నేసిన అదే ప్రాంతానికి చెందిన తమిళరసన్‌ (27) అనే యువకుడు ఆమెను లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థిని గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఆమె కొంతకాలం దాచిపెట్టింది. ఆపై ఆమె ఆరోగ్యం విషమించింది. ఆసుపత్రికి తరలించగా, గర్భంలో మృత శిశువు ఉందని వైద్యులు గుర్తించి, ఆపరేషన్ చేశారు.

ఆపై ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించగా, మెరుగైన చికిత్స కోసం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం దక్కలేదు. ఆ బాలిక చికిత్స పొందుతూ మరణించగా, ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు తమిళరసన్‌ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Girl
Minor
Tamilnadu
Police
Abortion
died

More Telugu News